దివ్యాంగులు, వృద్ధులకు సహాయ ఉపకరణాల ఎంపిక శిబిరం
భీమదేవరపల్లి, నవంబర్ 4 (ప్రజానేస్తం జ్వాల):
దివ్యాంగులు, వృద్ధులకు సహాయ ఉపకరణాల పంపిణీ కోసం ఈ నెల 19న భీమదేవరపల్లి మండలం ముల్కనూరు రైతువేదికలో ఎంపిక శిబిరం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పోచంపల్లి రాజిరెడ్డి తెలిపారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో అలింకో సంస్థ సహకారంతో నిర్వహించే ఈ శిబిరంలో వీల్‌చైర్లు, ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు, వాకర్లు, చేతికర్రలు, కృత్రిమ అవయవాల కోసం అర్హులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన దివ్యాంగులు, వృద్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.