🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 04 November 2026, 6:35 pm Posted by : Praja Nestham Jwala News

సమ్మె సమయంలోనూ టీకా సేవలకు అంతరాయం కలగొద్దు

News Image


భీమదేవరపల్లి, నవంబర్‌ 4 (ప్రజానేస్తం జ్వాల):

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మె కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య సూచించారు. బుధవారం భీమదేవరపల్లి మండలంలోని వంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవలు, ఔషధాలు, వ్యాక్సిన్ నిల్వలను పరిశీలించారు.

సమ్మె నేపథ్యంలో ఏఎన్‌ఎంలు విధులకు దూరంగా ఉన్నప్పటికీ చిన్నారులు, గర్భిణులకు టీకా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగించాలని ఆదేశించారు. పీహెచ్‌సీలో నిర్వహించిన టీకా కార్యక్రమంలో 11 మంది లబ్ధిదారులకు 21 డోసులు అందించినట్లు సిబ్బంది తెలిపారు. ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందేలా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని డీఎంహెచ్‌ఓ సూచించారు.
🏠 Home