🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 04 November 2026, 2:45 pm Posted by : Praja Nestham Jwala News

హుజూర్‌నగర్ మున్సిపాలిటీలో ముసలం

News Image

భార్యల పదవులు.. భర్తల పెత్తనంపై కౌన్సిలర్ల ఫిర్యాదు?


నిన్న భూ పంచాయితీలు.. నేడు ఆధిపత్య వివాదాలు.. అధికార పార్టీలో అంతర్గత అసంతృప్తి కలకలం!

సూర్యాపేట జిల్లా | హుజూర్‌నగర్ | ప్రజానేస్తం జ్వాల

హుజూర్‌నగర్ మున్సిపాలిటీలో రాజకీయ పరిణామాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. ఇప్పటికే భూ వ్యవహారాల వివాదాలతో చర్చల్లో నిలిచిన మున్సిపాలిటీలో తాజాగా మహిళా ప్రజాప్రతినిధుల పదవుల విషయంలో వారి భర్తల జోక్యం, పెత్తనం అంశం మరో కొత్త పంచాయితీకి తెరలేపింది. ఈ వ్యవహారంపై పలువురు కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

పదవులు భార్యలవి.. పెత్తనం భర్తలదా? అన్న ప్రశ్న ఇప్పుడు మున్సిపల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రజల ఓట్లతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు స్వతంత్రంగా వ్యవహరించాల్సిన చోట కుటుంబ సభ్యుల జోక్యం ఎంతవరకు సమంజసమన్న చర్చ తెరపైకి వస్తోంది. మహిళా ప్రజాప్రతినిధుల నిర్ణయాధికారం, స్వతంత్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఒకవైపు వార్డుల అభివృద్ధి, మరోవైపు రాజకీయ ఆధిపత్యాలు.. ఇంకోవైపు పరస్పర ఫిర్యాదులతో మున్సిపల్ రాజకీయాలు వేడెక్కుతున్నాయనే చర్చ సాగుతోంది. తాజా పరిణామాలు అధికార పార్టీలో అంతర్గత విభేదాలకు సంకేతమా? లేక స్థానిక స్థాయిలో నెలకొన్న విభేదాలా? అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.

మున్సిపల్ పాలనలో ప్రజాప్రతినిధుల గౌరవం, పారదర్శకత, అధికారిక విధివిధానాల అమలుపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని స్థానికంగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఫిర్యాదులోని పూర్తి వివరాలు, కమిషనర్ స్పందన, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి వివరణ వెలువడితేనే ఈ వివాదంపై మరింత స్పష్టత రానుంది.
🏠 Home