🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 04 November 2026, 2:40 pm Posted by : Praja Nestham Jwala News

తుఫాను బాధిత రైతులకు తక్షణ పరిహారం అందించాలి

News Image
హుజూర్‌నగర్‌లో పంట నష్టాన్ని మంత్రి ఉత్తమ్ పరిశీలించాలి: టీడీపీ నాయకుడు మండవ వెంకటేశ్వర్లు గౌడ్

హుజూర్‌నగర్, నవంబర్‌ 4 (ప్రజానేస్తం జ్వాల): తుఫాన్ల ప్రభావంతో హుజూర్‌నగర్ నియోజకవర్గంలో వరి పంట దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని టీడీపీ నియోజకవర్గ నాయకుడు మండవ వెంకటేశ్వర్లు గౌడ్ డిమాండ్ చేశారు.

భారీ వర్షాలకు వరి పంట నేలకొరిగి నీటిలో, బురదలో కూరుకుపోయిందని తెలిపారు. స్థానిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించాలని, అధికారులతో సమగ్ర సర్వే చేయించి బాధిత రైతులకు న్యాయమైన పరిహారం అందించాలని కోరారు.

ఎల్‌హెచ్‌పీఎస్ జాతీయ నాయకుడు బానోతు వెంకటరాం నాయక్, పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొమ్మగాని వెంకటేశ్వర్లు గౌడ్ మాట్లాడుతూ హుజూర్‌నగర్‌ను కరువు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించి రైతులకు తక్షణ ఆర్థిక సహాయం, పంట బీమా ప్రయోజనాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాగేశ్వరరావు నాయక్, జక్కుల కిరణ్ యాదవ్, బత్తిని జానకిరాముల గౌడ్, ఎం. వెంకటరాజు, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home