విద్యుత్ షాక్తో ఆవు మృతి – రైతు కుటుంబానికి ఆర్థిక నష్టం
గూడూరు, నవంబర్ 4 (ప్రజానేస్తం జ్వాల): పడమటి తండా గ్రామానికి చెందిన భూక్య వీరన్న కి చెందిన ఆవు విద్యుత్ షాక్కు గురై మృతి చెందింది. ఈ ఘటనతో బాధిత కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆవు మృతి చెందడంతో కుటుంబానికి ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లింది. జీవనాధారంగా ఉన్న పశువును కోల్పోవడంతో బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. సంబంధిత అధికారులు స్పందించి ఘటనపై విచారణ జరిపి, బాధిత కుటుంబానికి తగిన నష్టపరిహారం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు