🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 04 November 2026, 9:10 am Posted by : Marelli kiran

ఈ నెల 23న ప్రతిజ్ఞ దివస్: విజయవంతం చేయాలని కన్వీనర్ ఎల్తూరి సాయికుమార్ పిలుపు!

News Image
హనుమకొండ, నవంబర్ 04 (ప్రజానేస్తం జ్వాల- ప్రతినిధి : మారెల్లి కిరణ్):
ఈ నెల 23వ తేదీన హనుమకొండ సుబేదారిలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించనున్న 'ప్రతిజ్ఞ దివస్' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రోగ్రామ్ కన్వీనర్ ఎల్తూరి సాయికుమార్ పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం కాకతీయ యూనివర్సిటీ క్రీడా మైదానంలో వాకర్స్‌తో కలిసి కార్యక్రమ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. యువతలో జాతీయ భావాన్ని, సమాజ హిత ఆలోచనలను పెంపొందించేందుకు ఈ వేడుకను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో శనిగరపు రాజేంద్రప్రసాద్, విజయ్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home