ఉపాధి హామీ పనులకు పోటెత్తిన కూలీలు: ఒకే రోజు 5 లక్షల మంది హాజరుతో సరికొత్త రికార్డు!
హనుమకొండ, నవంబర్ 04 (ప్రజానేస్తం జ్వాల- ప్రతినిధి : మారెల్లి కిరణ్):
తెలంగాణ రాష్ట్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద సరికొత్త రికార్డు నమోదైంది. సాధారణంగా పనులు తక్కువగా ఉండే నవంబర్ నెలలో చరిత్రలోనే తొలిసారిగా రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు ఏకంగా 5 లక్షల మంది కూలీలు ఉపాధి హామీ పనులకు హాజరయ్యారు. రాష్ట్రంలో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 53 వేల మంది కూలీలు పనులకు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. రికార్డు స్థాయిలో కూలీలు హాజరుకావడంపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. గ్రామాల్లో భూగర్భ జలాల పెంపునకు దోహదపడే చెరువుల పూడికతీత, ఇంకుడు గుంతల తవ్వకం వంటి జల సంరక్షణ పనులకు అధికారులు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె పిలుపునిచ్చారు.