🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 03 November 2026, 6:54 pm Posted by : Marelli kiran

వైఎస్సార్ నగర్ పేదల భూములు లాక్కోవద్దు: కలెక్టర్‌కు ప్రజా సంఘాల జేఏసీ వినతి!

News Image
హనుమకొండ, నవంబర్ 03 (ప్రజానేస్తం జ్వాల- ప్రతినిధి : మారెల్లి కిరణ్):
కాజీపేట మండలం వైఎస్సార్ నగర్ కాలనీలో నిరుపేదల భూములను బలవంతంగా లాక్కోవడం తక్షణమే ఆపాలని, గుడిసెవాసులకు సంపూర్ణ న్యాయం చేయాలని ప్రజా సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌ని ప్రజావాణిలో కలిసి వినతిపత్రం అందజేశారు.

కాలనీవాసులను నిత్యం భయభ్రాంతులకు గురిచేస్తూ, భౌతిక దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్ కోరారు. పేద ప్రజల ఆవాసాలకు రక్షణ కల్పిస్తూ జిల్లా అధికార యంత్రాంగం వెంటనే స్పందించి పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.
🏠 Home