🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 03 November 2026, 2:19 pm Posted by : Praja Nestham Jwala News

ఆపదలో ఉన్న వార్డు వాసికి అండగా కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి

News Image

సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరుకు కృషి చేస్తానని హామీ


హుజూర్‌నగర్, నవంబర్ 3 (ప్రజానేస్తం జ్వాల):

ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలవడమే ప్రజాప్రతినిధుల బాధ్యతని చాటుతూ హుజూర్‌నగర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, 25వ వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి మానవీయతను చాటుకున్నారు.

సీతారాం నగర్‌లోని 25వ వార్డుకు చెందిన పోలా నరసింహారావు ఇటీవల ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. కాలికి శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న కౌన్సిలర్ సంపత్ రెడ్డి మంగళవారం స్వయంగా వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.

బాధితుడికి ధైర్యం చెబుతూ, కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం త్వరగా అందేలా ప్రత్యేక చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు.

ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉంటూ, అవసరమైన సమయంలో అండగా నిలుస్తామని కౌన్సిలర్ భరోసా ఇవ్వడం పట్ల బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో వార్డు నాయకులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home