🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 01 November 2026, 11:17 am Posted by : Praja Nestham Jwala News

కీతవారిగూడెంలో మడెలయ్య నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన

News Image
వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా శంకుస్థాపన కార్యక్రమం


కీతవారిగూడెం: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామంలోని రజక కులస్తుల ఆరాధ్యదైవమైన శ్రీ మడెలయ్య స్వామి నూతన ఆలయ నిర్మాణంలో భాగంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

గ్రామ రజక కులస్తుల సంఘం చైర్మన్ పాలెల్లి అంజయ్య ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ రాయప్రోలు శ్రీరామయ్య శర్మ వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, రజక కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

నూతన ఆలయ నిర్మాణం చేపట్టడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో సాగింది.
🏠 Home