🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 31 October 2026, 8:59 pm Posted by : Marelli kiran

సీఎంఆర్ బియ్యం వ్యవహారంలో మిల్లర్ల అరెస్ట్

News Image


ములుగు, అక్టోబర్ 31 (ప్రజానేస్తం జ్వాల):

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బియ్యం సరఫరాలో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ములుగు జిల్లాకు చెందిన రైస్ మిల్లర్లను అరెస్టు చేసినట్లు సమాచారం.

జిల్లాలోని 25 రైస్ మిల్లుల పరిధిలో సుమారు 750 మెట్రిక్ టన్నుల సన్నబియ్యానికి బదులుగా దొడ్డు బియ్యం ప్రభుత్వానికి అప్పగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన సీఐడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

అయితే అధికారుల అనుమతితోనే బియ్యం మార్పు చేశామని, ప్రభుత్వానికి జరిమానా కూడా చెల్లించామని మిల్లర్లు వాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతుండటంతో ఇతర రైస్ మిల్లర్లలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.
🏠 Home