హనుమకొండ–కరీంనగర్ మధ్య కొత్త బైపాస్ మీదుగా నాన్‌స్టాప్ డీలక్స్ బస్సులు
హనుమకొండ, అక్టోబర్ 31 (ప్రజానేస్తం జ్వాల):
హనుమకొండ నుంచి కరీంనగర్ వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ ఆర్టీసీ కొత్త బైపాస్ మార్గంలో నాన్‌స్టాప్ డీలక్స్ బస్సు సర్వీసులను ప్రారంభిస్తోంది. ఈ విషయాన్ని వరంగల్-1 డిపో మేనేజర్ పుష్పాల అర్పిత తెలిపారు.
ఈ బస్సులు ప్రతిరోజూ హనుమకొండ బస్‌స్టేషన్ నుంచి ఉదయం 8:15, 8:55, 10:15, 11:35 గంటలకు బయలుదేరుతాయని పేర్కొన్నారు. టికెట్ ధర రూ.140గా నిర్ణయించినట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ సర్వీసులను వి