నిట్ టెక్నోజియాన్‌లో ఆకట్టుకున్న ‘ఎకో సిటీ’ ప్రదర్శన
వరంగల్, అక్టోబర్ 31 (ప్రజానేస్తం జ్వాల):
నిట్ వరంగల్ జాతీయ సాంకేతిక ఉత్సవం ‘టెక్నోజియాన్–26’లో సస్టైనబిలిటీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఎకో సిటీ’ ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంది. పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో ప్రకృతిని కాపాడుకుంటూ పర్యావరణహిత నగరాలను ఎలా నిర్మించవచ్చో విద్యార్థులు నమూనాల ద్వారా వివరించారు.
సహజ వనరుల వినియోగం, వ్యర్థాల నిర్వహణ, సౌర విద్యుత్ వంటి అంశాలతో సుస్థిర పట్టణాభివృద్ధిపై అవగాహన కల్పించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నిర్వాహకులు సూచించారు.