🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 31 October 2026, 8:49 pm Posted by : Marelli kiran

నకిలీ ఎస్టీ ధ్రువీకరణ పత్రంతో ఉద్యోగం.. హనుమకొండ వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్ష

News Image


హనుమకొండ, అక్టోబర్ 31 (ప్రజానేస్తం జ్వాల):

నకిలీ ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రంతో ప్రభుత్వ ఉద్యోగం పొందిన హనుమకొండ జిల్లాకు చెందిన మోతుకు తిరుపతిరెడ్డికి సంబంధించిన కేసులో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్‌లో అసిస్టెంట్ ఆఫీసర్‌గా పనిచేసిన ఆయన, నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ సమర్పించినట్లు విచారణలో తేలడంతో 2005 ఆగస్టు 22న ఉద్యోగం నుంచి తొలగించబడ్డారు.

ఈ కేసులో సిమ్లా ట్రయల్ కోర్టు విధించిన రెండేళ్ల సాధారణ జైలు శిక్షను హైకోర్టు సమర్థించింది. అయితే ఐపీసీ 467, 468 సెక్షన్ల కింద విధించిన శిక్షలను రద్దు చేసి, 420, 471 సెక్షన్ల కింద విధించిన శిక్షలను కొనసాగించింది. ఈ మేరకు 2026 సెప్టెంబర్ 25న జస్టిస్ రాకేశ్ కైన్థ్లా తీర్పు వెలువరించారు.
🏠 Home