🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 31 October 2026, 8:48 pm Posted by : Marelli kiran

గ్రావెల్ అనుమతులకు ఆన్‌లైన్ పోర్టల్‌.. అధికారులకు శిక్షణ

News Image


హనుమకొండ, అక్టోబర్ 31 (ప్రజానేస్తం జ్వాల):

జిల్లాలో గ్రావెల్‌ (మట్టి) తవ్వకాలు, తరలింపునకు అనుమతుల ప్రక్రియను సులభతరం చేసేందుకు సమగ్ర గ్రావెల్‌ నిర్వహణ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ తెలిపారు. ఈ విధానానికి సంబంధించిన పోర్టల్‌ వినియోగంపై శనివారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

కొత్త పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే ఐదు రోజుల నుంచి వారం రోజుల్లోగా అనుమతులు మంజూరు చేసేలా వ్యవస్థను రూపొందిస్తున్నట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. చిన్న మొత్తాల్లో గ్రావెల్‌ అవసరమైన సందర్భాల్లోనూ అనుమతులు పొందే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.

సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (సీజీజీ) ఈ పోర్టల్‌కు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయనుంది. గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు గ్రావెల్‌ తరలించే వాహనాల వివరాలు, రాకపోకల సమయాలను పోర్టల్‌లో నమోదు చేయనున్నారు. ఈ విధానం ద్వారా అక్రమ తవ్వకాలు, తరలింపును నియంత్రించడంతో పాటు పారదర్శకత పెంపొందించవచ్చని కలెక్టర్‌ తెలిపారు.
🏠 Home