🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 31 October 2026, 8:47 pm Posted by : Marelli kiran

వాతావరణ మార్పుల ప్రభావాన్ని అంచనా వేసే సూచిక రూపొందించిన నిట్ పరిశోధకులు

News Image


వరంగల్, అక్టోబర్ 31 (ప్రజానేస్తం జ్వాల):

తెలంగాణలో గ్రామీణ రహదారులపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని ముందస్తుగా అంచనా వేసేందుకు నిట్ వరంగల్ పరిశోధకులు ప్రత్యేక సూచికను రూపొందించారు. రాజిరెడ్డి మైకాల, శంకర్ సబావత్ సంయుక్తంగా ‘ఎల్వీఆర్ఏఐ’ (LVRAI) పేరుతో ఈ సూచికను అభివృద్ధి చేశారు.

జీఐఎస్ సాంకేతికత ఆధారంగా అధిక వర్షపాతం, ఆకస్మిక వరదలు, తీవ్రమైన ఉష్ణోగ్రతలు, రహదారుల నిర్మాణ పరిస్థితులు, గ్రామీణ ప్రజల రాకపోకలను విశ్లేషించి ఈ సూచికను రూపొందించారు. 2050 నాటికి ఎదురయ్యే వాతావరణ ముప్పులను అంచనా వేయడం ద్వారా మన్నికైన గ్రామీణ రహదారుల నిర్మాణం, దీర్ఘకాలిక నిర్వహణకు ఇది ఉపయోగపడుతుందని పరిశోధకులు తెలిపారు.
🏠 Home