🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 31 October 2026, 7:48 pm Posted by : Praja Nestham Jwala News

నల్గొండ క్రాస్‌రోడ్డులో సోహైల్ హోటల్ సీజ్

News Image


హైదరాబాద్, అక్టోబర్ 31 (ప్రజానేస్తం జ్వాల):

హైదరాబాద్‌లోని నల్గొండ క్రాస్‌రోడ్డులో ఉన్న సోహైల్ హోటల్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు చేపట్టారు.

శనివారం సాయంత్రం 4 గంటల నుంచి హోటల్‌లో తనిఖీలు నిర్వహించిన అధికారులు ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలను గుర్తించినట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో హోటల్‌ను సీజ్ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించకూడదని హోటల్ యాజమాన్యానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

అధికారుల చర్యలతో సోహైల్ హోటల్ ప్రస్తుతం మూతపడింది.
🏠 Home