🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 31 October 2026, 7:46 pm Posted by : Nagilla Rajinikanth

కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో నవంబర్ 3న హుండీ లెక్కింపు

News Image


భీమదేవరపల్లి, అక్టోబర్ 31 (ప్రజానేస్తం జ్వాల):

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి దేవస్థానంలో నవంబర్ 3వ తేదీ మంగళవారం హుండీ లెక్కింపు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి పి. కిషన్‌రావు తెలిపారు.

ఆలయ ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడుల నగదును లెక్కించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన భక్తులు హుండీ లెక్కింపునకు హాజరుకావచ్చని తెలిపారు.

సంబంధిత అధికారుల సమక్షంలో పారదర్శకంగా లెక్కింపు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో వెల్లడించారు.
🏠 Home