🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 31 October 2026, 7:45 pm Posted by : Praja Nestham Jwala News

గొల్లపల్లిలో కేత్ బచావో అభియాన్ కార్యక్రమం

News Image

వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలి: వ్యవసాయ శాఖ అధికారులు

భీమదేవరపల్లి, అక్టోబర్ 31 (ప్రజానేస్తం జ్వాల):

వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో భూగర్భ జలాల పరిరక్షణకు రైతులు సాగు విధానాల్లో మార్పులు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గొల్లపల్లి గ్రామంలో శనివారం కేత్ బచావో అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈవో సంతోష్ మాట్లాడుతూ.. యాసంగి సీజన్‌లో భూగర్భ జలాలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నందున రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటల సాగును పరిశీలించాలని సూచించారు.

ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవడంతో పాటు పీఎం కిసాన్ ఈ-కేవైసీ పూర్తి చేయాలని తెలిపారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఈ ప్రక్రియలు అవసరమని వివరించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చంద్రమోహన్, ఉప సర్పంచ్ ఎల్ది రాజు, గట్లనర్సింగాపూర్ క్లస్టర్ ఏఈవో సంతోష్, రైతులు పాల్గొన్నారు.
🏠 Home