🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 31 October 2026, 7:03 pm Posted by : Nagaraju Golla

పట్టభద్రుల ఓటరు నమోదుపై సమీక్ష సమావేశం

News Image


నడికూడ, అక్టోబర్ 31 (ప్రజానేస్తం జ్వాల): వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నడికూడ మండల కేంద్రంలోని మారుతి గార్డెన్స్‌లో ఓటరు నమోదు ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకునేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గతంలో ఓటరుగా నమోదైన వారు సైతం నిబంధనల ప్రకారం తిరిగి నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు.

అర్హులైన పట్టభద్రులు ఎవరూ ఓటరు నమోదు ప్రక్రియకు దూరం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించాలని, ఎన్నికల నిబంధనలు, నమోదు విధానంపై వివరించాలని కోరారు.

రాష్ట్ర నాయకుడు సాంబారి సమ్మారావు మాట్లాడుతూ అర్హులైన పట్టభద్రులను గుర్తించి ఓటరుగా నమోదు చేయించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని అన్నారు.

ఈ సమావేశంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
🏠 Home