🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 31 October 2026, 7:01 pm Posted by : Nagaraju Golla

చర్లపల్లి పాఠశాలలో జాతీయ ఐక్యత దినోత్సవం

News Image


నడికూడ, అక్టోబర్ 31(ప్రజానేస్తం జ్వాల): సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని నడికూడ మండలం చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో జాతీయ ఐక్యత దినోత్సవాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అచ్చ సుదర్శన్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయమని, విద్యార్థులు ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.

అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు గ్రామంలో ఐక్యత ర్యాలీ నిర్వహించి, జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేశారు.

కార్యక్రమంలో ఉపాధ్యాయులు లకావత్ దేవా, కంచ రాజ్ కుమార్, పుల్లూరి రామకృష్ణ, ప్రీ ప్రైమరీ టీచర్ బండి శ్వేత, విద్యార్థులు పాల్గొన్నారు.
🏠 Home