🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 31 October 2026, 6:39 pm Posted by : Nagilla Rajinikanth

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలి

News Image

భీమదేవరపల్లి, అక్టోబర్‌ 31 (ప్రజానేస్తం జ్వాల): వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాల లభ్యత తగ్గే అవకాశాలు ఉన్నందున రైతులు సాగు ప్రణాళికలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. నీటి లభ్యతను బట్టి పంటలను ఎంపిక చేసుకోవాలని, వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని ఏఈవో సంపత్ తెలిపారు.

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గొల్లపల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఆరుతడి పంటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చంద్రమోహన్, వార్డు సభ్యులు, ఏఈవో నాగరాజు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
🏠 Home