🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 31 October 2026, 6:36 pm Posted by : Nagilla Rajinikanth

కల్తీ పాల తయారీ కేంద్రాలను గుర్తించి సీజ్ చేయాలి

News Image


భీమదేవరపల్లి, అక్టోబర్‌ 31 (ప్రజానేస్తం జ్వాల): కెమికల్స్‌తో కృత్రిమ పాలు తయారు చేస్తూ ప్రజారోగ్యానికి ముప్పు కలిగిస్తున్న కల్తీ కార్యకలాపాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్ డిమాండ్ చేశారు.

పాలు, వంటనూనెలు, మసాలా దినుసులు తదితర నిత్యావసర ఆహార పదార్థాల్లో కల్తీని అరికట్టేందుకు అధికారులు నిరంతర తనిఖీలు చేపట్టాలని కోరారు. ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు వినియోగించే పాలలో కల్తీ జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.

హోటళ్లు, స్వీట్ హౌస్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లు, బిర్యానీ కేంద్రాల్లో ఆహార నాణ్యతను పరీక్షించాలని, కల్తీ కార్యకలాపాలు గుర్తించిన చోట నోటీసులతో సరిపెట్టకుండా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. అవసరమైన చోట తయారీ కేంద్రాలను సీజ్ చేసి, నిబంధనల ప్రకారం లైసెన్సులు రద్దు చేయాలని కోరారు.

ఫుడ్ సేఫ్టీ అధికారుల సంఖ్యను పెంచడంతో పాటు ప్రమాదకర రసాయనాల విక్రయాలపై నిఘా ఉంచాలని, ప్రజల ఫిర్యాదుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని చెప్యాల ప్రకాష్ ఒక ప్రకటనలో ప్రభుత్వాలను కోరారు.
🏠 Home