పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమానికి స్పందన
పొనుగోడు, అక్టోబర్ 31 (ప్రజానేస్తం జ్వాల): నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమానికి పొనుగోడు గ్రామంలో స్పందన లభించిందని బీఆర్ఎస్ మాజీ మండల అధికార ప్రతినిధి రామ్ సైదులు తెలిపారు. గ్రామ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పట్టభద్రుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఆన్లైన్లో నమోదు చేసిన అనంతరం గెజిటెడ్ అధికారి సంతకంతో సంబంధిత ఎమ్మార్వో కార్యాలయంలో అందజేసినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా రామ్ సైదులు మాట్లాడుతూ రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు పట్టభద్రుల మద్దతు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల నాయకులు బిల్లా వెంకటేశ్వర్లు, వార్డు సభ్యులు అనంతు కరుణాకర్ గౌడ్, రామ్ మధు, నందిపాటి నరహరి, రామ్ సతీష్, పొలంపల్లి మహా ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.