మాజీ కౌన్సిలర్ నందిగామ శంభయ్యకు పరామర్శ
హుజూర్‌నగర్, అక్టోబర్ 31 (ప్రజానేస్తం జ్వాల): హుజూర్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని మాధవరాయినిగూడెంకు చెందిన మాజీ కౌన్సిలర్ నందిగామ శంభయ్యను హుజూర్‌నగర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ శానంపూడి సైదిరెడ్డి పరామర్శించారు.
ఇటీవల అనారోగ్యానికి గురై గుండెకు బైపాస్ సర్జరీ చేయించుకున్న శంభయ్యను సైదిరెడ్డి కలిసి ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చికిత్స వివరాలు, ఆరోగ్య స్థితిగతులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా శంభయ్యకు ధైర్యం చెబుతూ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.
అనారోగ్య సమయంలో పరామర్శించి ఆత్మీయంగా పలకరించిన సైదిరెడ్డికి శంభయ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.