🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 31 October 2026, 4:42 pm Posted by : Praja Nestham Jwala News

బాసర సరస్వతి అమ్మవారి సన్నిధిలో మార్మోగిన రామనామ సంకీర్తనలు

News Image

కీతవారిగూడెం గ్రామానికి చెందిన భజన బృందాల ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమం


నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి పుణ్యక్షేత్రంలో కీతవారిగూడెం గ్రామానికి చెందిన భజన బృందాలు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక భజన కార్యక్రమాన్ని నిర్వహించాయి. రెండు తెలుగు రాష్ట్రాల భక్త రామదాస భజన మండలి సొసైటీ అధ్యక్షులు మాన్యశ్రీ సిద్ధేశ్వర స్వామివారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కీతవారిగూడెం గ్రామానికి చెందిన శ్రీ సీతారామాంజనేయ భజన బృందం అధ్యక్షులు గూడూరు తిరుపతయ్య, శ్రీరామ భజన బృందం తరఫున జుట్టు కొండ నరసింహారావు, శ్రీ వెంకటేశ్వర భజన బృందం అధ్యక్షులు ముత్తినేని రామయ్య ఆధ్వర్యంలో భజన బృందాల సభ్యులు పాల్గొన్నారు.

అమ్మవారి సన్నిధిలో భక్తి గీతాలు, శ్రీరామ నామ సంకీర్తనలు ఆలపిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. రామనామ స్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగగా, కీతవారిగూడెం గ్రామ భజన బృందాల భక్తి సేవలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

గ్రామీణ ప్రాంతాల్లో భజన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రజల్లో పెంపొందించేందుకు భజన బృందాలు చేస్తున్న కృషిని పలువురు అభినందించారు.

జై శ్రీరామ్! జై జై శ్రీరామ్!!
🏠 Home