🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 31 October 2026, 12:17 pm Posted by : Praja Nestham Jwala News

వేలేరులో వాటర్ ట్యాంక్ మరమ్మతు పనులు ప్రారంభం

News Image


వేలేరు, అక్టోబర్‌ 31 (ప్రజానేస్తం జ్వాల): వేలేరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ సమీపంలోని వాటర్ ట్యాంక్‌కు గ్రామపంచాయతీ నిధులతో నూతన మెట్లు, వాటర్ పైపులైన్, ఇతర మరమ్మతు పనులను సర్పంచ్ బిల్లా యాదగిరి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పాత మెట్లు శిథిలావస్థకు చేరుకోవడం, పైపులైన్ సమస్యల కారణంగా సిబ్బంది, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. పనులను త్వరగా పూర్తి చేసి నిరంతర తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీకర్, వార్డు సభ్యులు చైతన్య, లక్ష్మీనారాయణ, సురేష్, సునీల్, గ్రామ పెద్దలు, కాలనీవాసులు పాల్గొన్నారు.
🏠 Home