ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
హనుమకొండ, అక్టోబర్ 30 (ప్రజానేస్తం జ్వాల):
కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని పొద్దుటూరి జ్యువెల్ గార్డెన్స్ సమీపంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు డివైడర్ దాటుతున్న గుర్తుతెలియని వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వయస్సు సుమారు 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు.
బస్సు డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షి పాషా కాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఎస్సై మౌనిక రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.