🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 30 October 2026, 9:18 pm Posted by : Marelli kiran

పార్ట్‌టైం అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే నాయిని

News Image


హనుమకొండ, అక్టోబర్ 30 (ప్రజానేస్తం జ్వాల):

కాకతీయ విశ్వవిద్యాలయంతో పాటు రాష్ట్రంలోని వివిధ డిగ్రీ, పీజీ కళాశాలల్లో పనిచేస్తున్న పార్ట్‌టైం అధ్యాపకుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. నూతనంగా ఎన్నికైన పార్ట్‌టైం అధ్యాపకుల సంఘం ప్రతినిధులు శుక్రవారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు.

ఈ సందర్భంగా అధ్యాపకులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు, దీర్ఘకాలంగా పనిచేస్తున్న తమ సేవలను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ ఉద్యోగ భద్రత, సేవా సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.

అధ్యాపకుల విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన నాయిని రాజేందర్ రెడ్డి, నవంబర్ 2వ తేదీన ప్రభుత్వ పెద్దలు, ఉన్నత విద్యామండలి అధికారులను స్వయంగా కలిసి సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. పార్ట్‌టైం అధ్యాపకులకు న్యాయం జరిగేలా సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని స్పష్టం చేశారు.
🏠 Home