సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్.. ఒక్కొక్కరికి సగటున రూ.1.10 లక్షలు
సింగరేణి, అక్టోబర్ 30 (ప్రజానేస్తం జ్వాల):
సింగరేణి బొగ్గు గని కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. మొత్తం రూ.419 కోట్ల పీఎల్‌ఆర్ (PLR) బోనస్‌ను నవంబర్ 5న కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ బోనస్ ద్వారా సుమారు 38 వేల మంది అర్హులైన కార్మికులకు సగటున ఒక్కొక్కరికి రూ.1,10,250 అందనుంది. ఇటీవల అందించిన దసరా బోనస్‌తో కలిపి నెల రోజుల వ్యవధిలో ఒక్కో కార్మికుడికి సగటున రూ.2.65 లక్షల వరకు ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. దీంతో సింగరేణి కార్మికుల్లో పండుగ ఉత్సాహం నెలకొంది.