🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 30 October 2026, 9:16 pm Posted by : Marelli kiran

నిబద్ధత, నిజాయితీతోనే ఉన్నత లక్ష్యాల సాధన: ఐఏఎస్ గరిమా అగర్వాల్

News Image


హనుమకొండ, అక్టోబర్ 30 (ప్రజానేస్తం జ్వాల):

జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ, నిబద్ధత మరియు నిజాయితీతో కృషి చేసినప్పుడే ఉన్నత లక్ష్యాలను సాధించగలమని తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ అధికారిణి గరిమా అగర్వాల్ అన్నారు. వరంగల్ నిట్‌లో నిర్వహిస్తున్న ‘టెక్నోజియాన్–2026’ వేడుకల్లో భాగంగా అంబేద్కర్ లెర్నింగ్ సెంటర్‌లో విద్యార్థులతో ఆమె ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తన సివిల్ సర్వీసెస్ ప్రయాణం, పాలనారంగంలో ఎదురయ్యే సవాళ్లు, ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారుల బాధ్యతలను వివరించారు. యువత ఉద్యోగాలకే పరిమితం కాకుండా నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో నిట్ డైరెక్టర్, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
🏠 Home