చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్ట్, రూ.4 లక్షల బంగారం గుర్తింపు: ఎస్పీ కె.నరసింహ
సూర్యాపేట, అక్టోబర్ 30 (ప్రజానేస్తం జ్వాల):
కిరాణా దుకాణాల్లో ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఖమ్మంకు చెందిన ఇద్దరు నిందితులను సూర్యాపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు రూ.4 లక్షల విలువైన బంగారాన్ని గుర్తించారు.
ఈ నెల 11న కోదాడలో, 26న సూర్యాపేటలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసులను సీసీటీవీ ఆధారంగా ఛేదించినట్లు ఎస్పీ కె.నరసింహ తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు జిల్లా బహిష్కరణ, పీడీ యాక్ట్ అమలును పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. మహిళలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.