ప్రతి జిల్లాలో 5 వేల వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలి
హైదరాబాద్, అక్టోబర్ 30 (ప్రజానేస్తం జ్వాల):
అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నింటినీ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాలో కనీసం 5 వేల బ్యాక్లాగ్ ఉద్యోగాలను గుర్తించి భర్తీ చేయాలని కోరారు.
శుక్రవారం హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్ర వికలాంగుల డైరెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వికలాంగుల పెన్షన్ రూ.6 వేలకు పెంపు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ప్రత్యేక సంక్షేమ శాఖ ఏర్పాటు, చట్టబద్ధమైన రిజర్వేషన్ల అమలు వంటి హామీలను ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.
హామీలను తక్షణమే అమలు చేయకపోతే కొడంగల్ నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేసి, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వంపై పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ వికలాంగుల సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు