🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 30 October 2026, 9:11 pm Posted by : Praja Nestham Jwala News

ఎస్‌ఐఆర్‌పై అపోహలు తొలగించాలి.. వాస్తవాలు ప్రజలకు వివరించాలి

News Image


ధర్మసాగర్, అక్టోబర్ 30 (ప్రజానేస్తం జ్వాల): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలతో ప్రజల్లో ఏర్పడుతున్న అపోహలను తొలగించి, వాస్తవాలను వివరించాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. పారదర్శకమైన ఓటర్ల జాబితా ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎంతో కీలకమని పేర్కొన్నారు.

బీజేపీ ధర్మసాగర్ మండల అధ్యక్షుడు బైరపాక కుమార్ ఆధ్వర్యంలో మండలంలోని ప్రముఖులు, ఓటర్లను కలిసి SIR ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సోమిడి వెంకట్ రెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ నాయకుడు బొజ్జపల్లి సుభాష్ ప్రజలకు SIR ప్రక్రియపై వాస్తవాలను వివరించారు.

కార్యక్రమంలో బీజేపీ నాయకులు నాగవెల్లి యుగేందర్, గంకిడి వెంకట్ రెడ్డి, గాజుల సంపత్, దాసరి సదానందం, బచ్చు శివప్రసాద్ రెడ్డి, సాయం సందీప్, వెంకటేష్, చింత రఘుదీర్, చింతల రాజు, సాంబరాజు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home