🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 30 October 2026, 9:10 pm Posted by : Praja Nestham Jwala News

పట్టభద్రులంతా ఓటు హక్కు నమోదు చేసుకోవాలి

News Image


గరిడేపల్లి, అక్టోబర్‌ 30 (ప్రజానేస్తం జ్వాల): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులైన ప్రతి ఒక్కరూ నవంబర్ 6వ తేదీలోగా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని సింగిల్ విండో మాజీ డైరెక్టర్ గుగులోత్ సాంపు నాయక్ కోరారు.

మండల పరిధిలోని గారకుంట తండాలో గురువారం పట్టభద్రులను కలిసి ఓటు నమోదు దరఖాస్తు ఫారాలను అందజేశారు. డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన వారు, ఉపాధ్యాయులు, ఇతర పట్టభద్రులు తమ విద్యార్హత ధ్రువపత్రాలను అందిస్తే ఓటు నమోదు ప్రక్రియలో సహకరిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు గుగులోత్ సందీప్ నాయక్, నరేందర్ నాయక్, పట్టభద్రులు కరుణాకర్ నాయక్, రామకోటి నాయక్, రవీందర్ నాయక్, రవి నాయక్, కోటయ్య, లింగా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home