రైతు ధాన్యం తరలింపుపైనా కేసులా?
•పంట పండించడానికి ప్రకృతితో పోరాటం.. అమ్ముకోవడానికి దళారులతో పోరు.. ఇప్పుడు రవాణాపైనా అధికారుల ఆంక్షలా!
•రైతులపై RTO కేసులు నమోదు చేయొద్దు.. మానవతా దృక్పథంతో వ్యవహరించాలి: రాపోలు నవీన్ కుమార్
నేరేడుచర్ల, ప్రజానేస్తం/జ్వాల:రైతన్నకు అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయని, పంట పండించడానికి ప్రకృతితో పోరాడిన రైతు.. పంట అమ్ముకోవడానికి దళారులతో పోరాడుతుంటే, చివరకు ధాన్యం రవాణా చేసుకునేందుకు అధికారుల కేసులను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని బీఆర్‌ఎస్ నియోజకవర్గ నాయకులు రాపోలు నవీన్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానిక నేరేడుచర్ల కేంద్రంలో రైతులతో కలిసి ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాలు, తుఫానుల ప్రభావం, విద్యుత్ కోతలు, సాగునీటి కొరత వంటి అనేక సమస్యలను అధిగమించి రైతులు పంటను కాపాడుకున్నారని తెలిపారు. కష్టపడి పండించిన ధాన్యానికి తొలుత క్వింటాల్‌కు రూ.5 వేల వరకు ధర పలికినా, దళారుల దోపిడీ కారణంగా ప్రస్తుతం రూ.4 వేల నుంచి రూ.3,500 వరకు పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇన్ని కష్టాలను భరించి పండించిన ధాన్యాన్ని ట్రాక్టర్ల ద్వారా మిల్లులకు తరలించే సమయంలో ఓవర్‌లోడ్, వాహన పత్రాల పేరుతో RTO అధికారులు రైతులపై కేసులు నమోదు చేయడం సమంజసం కాదన్నారు. రైతుకు గిట్టుబాటు ధర లేదు.. సాగుకు సరిపడా విద్యుత్ లేదు.. పంటకు నీరు లేదు.. ప్రకృతి సహకరించడం లేదు.. దళారుల నుంచి రక్షణ లేదు.. చివరకు పండించిన ధాన్యాన్ని తరలించుకోవడానికీ ఇబ్బందులు ఎదురైతే రైతు తన గోడు ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు.
ప్రతి సమస్యకు రైతే బాధితుడిగా మారుతున్నాడని, ప్రతి భారానికి రైతే బాధ్యత వహించాలా అని నిలదీశారు. RTO అధికారులు మానవతా దృక్పథంతో ఆలోచించి, ధాన్యం రవాణా చేసుకునే రైతుల విషయంలో ఓవర్‌లోడ్, వాహన పత్రాల పేరుతో కేసులు నమోదు చేయకుండా నిబంధనల పరిధిలో తగిన వెసులుబాటు కల్పించాలని చేతులెత్తి విజ్ఞప్తి చేశారు.
రైతును ఇబ్బంది పెట్టకండి.. రైతుకు అండగా నిలవండి. రైతన్న బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతు కంట కన్నీరు రాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది అని రాపోలు నవీన్ కుమార్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తకెళ్ల నాగార్జున, షేక్ నాగుల్ మీరా, అరే శ్రీకాంత్, సైదా నాయక్, పత్తిపాక రమేష్, అమరవరపు సతీష్ కుమార్, గౌతమ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.