🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 30 October 2026, 3:47 pm Posted by : Praja Nestham Jwala News

లింగాపూర్‌లో జనగర్జన.. పోడు హక్కులు, మండల అభివృద్ధి కోసం భారీ ధర్నా!

News Image


కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, అక్టోబర్ 30, (ప్రజానేస్తం జ్వాల): మండల అభివృద్ధి, పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండల కేంద్రంలో ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి ధర్నా నిర్వహించారు.

మండలంలోని గ్రామాల్లో నెలకొన్న అభివృద్ధి సమస్యలను పరిష్కరించి, మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు న్యాయం చేయాలని, అర్హులైన వారందరికీ భూములపై హక్కులు కల్పించాలని కోరారు.

మండల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజనుల హక్కుల సాధన, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చేపట్టిన ఈ ధర్నాకు భారీగా ప్రజలు తరలిరావడంతో లింగాపూర్ మండల కేంద్రం జనసంద్రమైంది.
🏠 Home