ఖిలా వరంగల్ తూర్పుకోటలో ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన
ఖిలా వరంగల్, అక్టోబర్ 30 (ప్రజానేస్తం జ్వాల): ఖిలా వరంగల్ తూర్పుకోటలో ఎం.కే. ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన 5వ విడత ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతమైంది. ఈ శిబిరంలో మొత్తం 110 మందికి కంటి పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించారు.
వైద్య పరీక్షల్లో 40 మందికి కంటి ఆపరేషన్లు అవసరమని గుర్తించిన వైద్యులు, తదుపరి చికిత్స, శస్త్రచికిత్సల నిమిత్తం వారిని హైదరాబాద్‌లోని శంకర హాస్పిటల్‌కు తరలించారు. మరో 60 మందికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు.
స్థానిక పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ఎం.కే. ఫౌండేషన్ నిర్వాహకులను అభినందించారు