ఖిలా వరంగల్ తూర్పుకోటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ఖిలా వరంగల్ (ప్రజానేస్తం జ్వాల):
ఖిలా వరంగల్ తూర్పుకోట ప్రాంతంలోని రేషన్ షాపుల వద్ద గురువారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
37వ డివిజన్ పరిధిలో రెవెన్యూ అధికారి నరసింహ స్వామి, మున్సిపల్ వార్డు అధికారి రవి, రేషన్ డీలర్ రాజబోయిన కుమారస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తాజా మాజీ కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్ లబ్ధిదారులకు కార్డులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాజమల్లు, సాంబమూర్తి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.