🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 29 October 2026, 9:05 pm Posted by : Muthineni babu

గ్రూప్‌–3 రోస్టర్ విధానాన్ని పునఃపరిశీలించాలి: రాకేష్ ఎనమాల

News Image


తొర్రూరు, అక్టోబర్ 29 (ప్రజానేస్తం జ్వాల):

ఎస్సీ వర్గీకరణలో భాగంగా గ్రూప్‌–3 ఉద్యోగ నియామకాల రోస్టర్ విధానంలో మాల సామాజిక వర్గానికి న్యాయం చేయాలని మాల మహానాడు మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు రాకేష్ ఎనమాల కోరారు. తొర్రూరులో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాల, మాల ఉపకులాల జనాభాపై సమగ్ర సర్వే నిర్వహించి, జీవో నంబర్‌ 99 నిబంధనలను పునఃపరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ అంశంపై ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనలు చేపడతామని తెలిపారు.

సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శులు దాసరి ప్రకాష్, గుర్రాల లింగయ్యతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
🏠 Home