జనగామ ఎంఈఓ కార్యాలయంలో ఆర్టీఐ సమాచార బోర్డు ఏదీ?
జనగామ, అక్టోబర్ 29 (ప్రజానేస్తం జ్వాల):
జనగామ మండల విద్యాధికారి (ఎంఈఓ) కార్యాలయంలో సమాచార హక్కు చట్టానికి సంబంధించిన వివరాల బోర్డు స్పష్టంగా అందుబాటులో లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సమాచారం కోసం వచ్చే ప్రజలు, ఉపాధ్యాయులు సంబంధిత అధికారులను గుర్తించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.
సమాచార హక్కు చట్టం–2005లోని సెక్షన్ 4(1)(బి) ప్రకారం ప్రభుత్వ కార్యాలయాలు ప్రజా సమాచార అధికారి, అప్పిలేట్ అధికారి వివరాలు సహా కీలక సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలి. ఈ నేపథ్యంలో ఎంఈఓ కార్యాలయంలో సంబంధిత వివరాలను స్పష్టంగా ప్రదర్శించి, చట్ట నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.