🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 29 October 2026, 3:59 pm Posted by : Praja Nestham Jwala News

పట్టభద్రుల ఓటరు నమోదు కోసం ముందడుగు వేసిన సర్పంచ్ బొల్లెపల్లి రామనాథం

News Image
కీతవారిగూడెం పట్టభద్రుల తరఫున 20 దరఖాస్తుల సమర్పణ
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకునేలా చొరవ

గరిడేపల్లి, అక్టోబర్ 29 (ప్రజానేస్తం జ్వాల):

కీతవారిగూడెం గ్రామ పట్టభద్రులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించే ప్రక్రియలో గ్రామ సర్పంచ్ బొల్లెపల్లి రామనాథం చొరవ తీసుకున్నారు. పట్టభద్రుల నూతన ఓటరు నమోదు కోసం అవసరమైన దరఖాస్తులను సిద్ధం చేయించి, గురువారం గరిడేపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించారు.

గ్రామానికి చెందిన పట్టభద్రుల వివరాలతో మీ సేవ కేంద్రం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు నమోదు చేయించి, గెజిటెడ్ అధికారి సంతకాలు పొందిన అనంతరం మొత్తం 20 దరఖాస్తులను సంబంధిత తహసీల్దార్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్‌కు అందజేశారు. పట్టభద్రులు తమ ప్రజాస్వామ్య హక్కైన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

గ్రామంలోని అర్హులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించడం, అవసరమైన దరఖాస్తుల సమర్పణలో సహకరించడం వంటి చర్యలకు ఈ కార్యక్రమం దోహదపడింది.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొల్లెపల్లి రామనాథంతో పాటు మండల బీఆర్‌ఎస్ నాయకులు పోలంపల్లి ఆనంద్ బాబు, హుజూర్‌నగర్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ పిడమర్తి అంజి, గ్రామ బీఆర్‌ఎస్ నాయకులు కీత పరశురాం, దాసరి ఆంజనేయులు, నర్సింగ్ వెంకటేశ్వర్లు, తవిడబోయిన వెంకన్న, గోపాల దాసు హుస్సేన్, నర్సింగ్ రవి, ఎస్‌కే సైదా హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

🏠 Home