🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 29 October 2026, 3:54 pm Posted by : Praja Nestham Jwala News

బీఆర్‌ఎస్ కార్యకర్త కుటుంబానికి పిల్లుట్ల రఘు ఆర్థిక చేయూత!

News Image
కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటాం.. కష్టకాలంలో ఆదుకుంటాం

బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్త సంక బుడ్డి సైదులు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

కల్లూరు, అక్టోబర్ 29 (ప్రజానేస్తం జ్వాల):

పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని బీఆర్‌ఎస్ హుజూర్‌నగర్ నియోజకవర్గ నాయకులు పిల్లుట్ల రఘు భరోసా ఇచ్చారు. నేరేడుచర్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్త సంక బుడ్డి సైదులు ఇటీవల మృతి చెందడంతో, ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు పిల్లుట్ల రఘు ముందుకొచ్చారు.

పిల్లుట్ల రఘు ఆదేశాల మేరకు గురువారం కల్లూరు గ్రామానికి వెళ్లిన బీఆర్‌ఎస్ పార్టీ మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, హుజూర్‌నగర్ నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడు లావుడ్యా శ్రీను నాయక్.. సైదులు ధర్మపత్ని శివమ్మకు ఆర్థిక సాయం అందజేశారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ.. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను, వారి కుటుంబాలను కష్టకాలంలో ఆదుకోవడం తమ బాధ్యతని పేర్కొన్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని ఉద్యమకారులు, పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యకర్తల కుటుంబాలకు ఏ కష్టం వచ్చినా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

కార్యకర్తల సంక్షేమం, వారి కుటుంబాలకు అండగా నిలవడం పార్టీ నాయకత్వ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షుడు పంగ శ్రీను, బీఆర్‌ఎస్ నాయకులు జిలకర రామస్వామి, జింకల భాస్కర్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, సైదులు, శివాజీ, ఇతర నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
🏠 Home