🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 28 October 2026, 8:18 am Posted by : Praja Nestham Jwala News

తీవ్ర కరువు జాబితాలో హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని రెండు మండలాలు!

News Image

పాలకీడు, చింతలపాలెం మండలాలకు కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తింపు
• జీవో ఎంఎస్ నంబర్ 03 ద్వారా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
సూర్యాపేట జిల్లా, ప్రజానేస్తం జ్వాల:
హుజూర్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని రెండు మండలాలను తెలంగాణ ప్రభుత్వం తీవ్ర కరువు ప్రభావిత ప్రాంతాల జాబితాలో చేర్చింది. పాలకీడు, చింతలపాలెం మండలాలను తీవ్ర కరువు మండలాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం జీఓ ఎంఎస్ నంబర్ 03 ద్వారా ప్రకటించింది.
కరువు పరిస్థితుల నేపథ్యంలో ఈ రెండు మండలాలకు ప్రభుత్వ గుర్తింపు లభించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కరువు ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయక చర్యలు అందనున్నాయనే అంశంపై ఆసక్తి నెలకొంది.
🏠 Home