🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 21 October 2026, 9:29 am Posted by : Praja Nestham Jwala News

తొర్రూరులో జమ్మి పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

News Image

తొర్రూరు: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని తొర్రూరు పట్టణంలోని 14వ వార్డు, శ్రీకృష్ణ మందిరంలో నిర్వహించిన జమ్మి పూజల్లో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దసరా పండుగ విజయానికి, శుభానికి ప్రతీక అని పేర్కొన్నారు. పాలకుర్తి నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రతి కుటుంబంలో శాంతి, సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.
🏠 Home