🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 21 October 2026, 9:18 am Posted by : Praja Nestham Jwala News

వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు డా. శ్రీకాంత్ గౌడ్ పేరు ఖరారు

News Image
హనుమకొండ, అక్టోబర్ 20 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి: మారెల్లి కిరణ్): వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ (TRS) పార్టీ తన అభ్యర్థిగా డా. శ్రీకాంత్ గౌడ్‌ను ప్రకటించింది. పార్టీ అధినేత్రి కవిత ఈ మేరకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. దీంతో పార్టీ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించింది. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ గౌడ్ కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. తెలంగాణ జాగృతి ఆవిర్భావం నుంచి కవితతో కలిసి పనిచేస్తున్న ఆయనకు దసరా పర్వదినం సందర్భంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక టికెట్ కేటాయించారు.
🏠 Home