🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 19 October 2026, 8:13 pm Posted by : Praja Nestham Jwala News

వరంగల్ నిట్‌లో సాఫ్ట్‌వేర్ పరిశోధన కేంద్రం ప్రారంభం

News Image
హనుమకొండ, అక్టోబర్ 19 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి మారెల్లి కిరణ్‌): వరంగల్ నిట్‌లో సాఫ్ట్‌వేర్ పనితీరు విశ్లేషణ, పరిశోధన కేంద్రం (SS-SPARC) సోమవారం ప్రారంభమైంది. నిట్ 1983 బ్యాచ్ పూర్వ విద్యార్థి, అమెరికాలోని SAP సంస్థలో పనిచేస్తున్న శ్రీనివాస్ వి. అట్లూరి అందించిన రూ.12.5 లక్షల విరాళంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ద్వారా విద్యార్థులకు సాఫ్ట్‌వేర్ పనితీరు పరీక్షలు, డేటాబేస్ విశ్లేషణలో ప్రాయోగిక శిక్షణ అందనుంది. నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిధ్యాధర్ సుబుధి సమక్షంలో జరిగిన ప్రారంభోత్సవంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు
🏠 Home