🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 19 October 2026, 8:11 pm Posted by : Praja Nestham Jwala News

స్వచ్ఛతా హీ సేవా.. వరంగల్ నిట్‌లో శ్రమదానం

News Image


హనుమకొండ, అక్టోబర్ 19 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి మారెల్లి కిరణ్‌): పరిశుభ్రమైన క్యాంపస్, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా వరంగల్ నిట్ ప్రాంగణంలో ‘స్వచ్ఛతా హీ సేవా’, ఎస్‌సీడీపీఎం-6 (SCDPM-6) ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా విస్తృత పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, సిబ్బంది క్యాంపస్ పరిసరాలను శుభ్రపరిచేందుకు శ్రమదానంలో పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన అభివృద్ధి ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు. క్యాంపస్‌ను పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సంస్థ అధికారులు పేర్కొన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు స్వచ్ఛందంగా పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొని పరిశుభ్రమైన వాతావరణం ఏర్పాటుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
🏠 Home