🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 19 October 2026, 8:08 pm Posted by : Praja Nestham Jwala News

మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన సదస్సు

News Image

హనుమకొండ, అక్టోబర్ 19 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి మారెల్లి కిరణ్‌): మహిళల భద్రత, రక్షణపై అవగాహన కల్పించేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వరంగల్ వెస్ట్ కాసం జనత షాపింగ్ మాల్‌లో సోమవారం షీ టీమ్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఎస్సై రామారావు పాల్గొని మహిళల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సమాజంలో నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. మహిళలపై జరిగే వేధింపులు, ఆకతాయి చేష్టలను అరికట్టేందుకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా వేధింపులకు గురైతే భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. ఆపద సమయంలో డయల్ 100 లేదా షీ టీమ్ వాట్సాప్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని షాపింగ్ మాల్ ఉద్యోగినులు, వినియోగదారులకు అవగాహన కల్పించారు. మహిళల భద్రతకు పోలీసు శాఖ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
🏠 Home