హుజూర్నగర్ కోదాడ నియోజకవర్గాల్లో గ్రామీణ రహదారులకు మహర్దశ
•కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో రూ.174.325 కోట్లతో రహదారుల అభివృద్ధి
•54 పనులు.. 156.95 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం
•13 మండలాల్లో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వ నిధులు
•మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కృషితో నిధుల మంజూరు
హుజూర్‌నగర్, (ప్రజా నేస్తం జ్వాల):
సూర్యాపేట జిల్లాలోని కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో గ్రామీణ రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి ప్రత్యేక చొరవతో రెండు నియోజకవర్గాల్లో మొత్తం రూ.174.325 కోట్లతో రహదారుల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు లభించాయి. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సీఆర్‌ఆర్ పథకం కింద ఈ పనులు చేపట్టనున్నారు.
కోదాడకు రూ.30 కోట్లు.. హుజూర్‌నగర్‌కు రూ.144.325 కోట్లు
కోదాడ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో తొమ్మిది రహదారి పనులకు రూ.30 కోట్లు మంజూరయ్యాయి. వీటి ద్వారా 25.40 కిలోమీటర్ల మేర రహదారులు అభివృద్ధి చేయనున్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 45 రహదారి పనులకు రూ.144.325 కోట్లు కేటాయించారు. ఈ పనుల ద్వారా 131.55 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దానకిశోర్ జీవో నంబర్లు 558, 559 ద్వారా సంబంధిత ఉత్తర్వులు జారీ చేశారు.
మారుమూల గ్రామాలు, తండాలకు మెరుగైన రవాణా
హుజూర్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని నేరేడుచర్ల, గరిడేపల్లి, మఠంపల్లి, మేళ్లచెరువు, పాలకీడు, చింతలపాలెం, హుజూర్‌నగర్ మండలాల్లో పలు రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. నేరేడుచర్ల మండలంలో దిర్శించర్ల–ఎల్‌బీ నగర్, మేడారం–అన్నారం, మేడారం–దాచారం, ఎల్లారం–దాచారం, నర్సయ్యగూడెం తదితర మార్గాల్లో రహదారుల అభివృద్ధికి నిధులు కేటాయించారు. గరిడేపల్లి మండలంలోనూ పలు గ్రామాలను అనుసంధానించే రహదారులకు నిధులు మంజూరయ్యాయి.
మఠంపల్లి, మేళ్లచెరువు, పాలకీడు మండలాల్లోని గ్రామాలు, గిరిజన తండాలకు రహదారి సౌకర్యాలు మెరుగుపడేలా వివిధ పనులను ప్రతిపాదించారు. కోదాడ నియోజకవర్గంలోని అనంతగిరి, చిలుకూరు, కోదాడ, మునగాల, మోతె, నడిగూడెం మండలాల్లోనూ పలు రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు.
రైతులు, విద్యార్థులకు ప్రయోజనం
ఈ రహదారుల నిర్మాణం పూర్తయితే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. రైతులు వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించడంతో పాటు విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు చేరుకోవడం సులభతరం కానుంది. గర్భిణులు, రోగులు అత్యవసర వైద్య సేవలు పొందేందుకు కూడా ఈ రహదారులు దోహదపడనున్నాయి. ముఖ్యంగా మారుమూల గ్రామాలు, గిరిజన తండాలకు ప్రధాన రహదారులతో అనుసంధానం పెరగనుంది.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కృషితో మంజూరైన ఈ నిధులతో గ్రామీణ మౌలిక సదుపాయాలు బలోపేతం కానున్నాయి. రహదారి పనులు నాణ్యతతో, నిర్ణీత సమయంలో పూర్తిచేస్తే గ్రామీణ ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరనుంది.